Isro: ఎస్ఎస్ఎల్వీ ప్రయోగ ఫలితంపై ఉత్కంఠ.. ఇంకా అందని డేటా

Isro Analysing data on the status of the satellites vehicle performance

  • ప్రయోగ దశలు సజావుగానే పూర్తి
  • టెర్మినల్ దశలో సమాాచారంలో నష్టం
  • డేటాను విశ్లేషిస్తున్నట్టు ప్రకటించిన ఇస్రో
  • కక్ష్యలోకి రాకెట్లు చేరడంపై సందేహాలు

ఇస్రో ప్రతిష్టాత్మకంగా, ఎన్నో ఆశలతో చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం సక్సెస్ అయిందా? లేదా అన్నదానిపై ఉత్కంఠ వీడడం లేదు. ఈ ఉపగ్రహ వాహక నౌక రెండు శాటిలైట్లను కక్ష్యలోకి తీసుకెళ్లింది. ప్రయోగంలోని అన్ని దశలు సజావుగానే పూర్తయ్యాయని.. కానీ, టెర్మినల్ దశలో సమాచార నష్టం జరిగినట్టు ఇస్రో ప్రకటించింది. 

తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ ప్రయోగం ఉదయం 9.18 నిమిషాలకు జరిగింది. అజాదికాశాట్, ఈవీఎస్ 02ను అనే రెండు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సి ఉంది. ప్రయోగం జరిగిన 12 నిమిషాల్లోపే ఈ ఫలితం తెలిసిపోవాలి. ఎందుకంటే తక్కువ కక్ష్యలో ప్రవేశపెట్టడానికి ఉద్దేశించినదే ఎస్ఎస్ఎల్వీ. కానీ, ఇందుకు సంబంధించిన కచ్చితమైన సమాచారం మధ్యాహ్నం అయినా ఇస్రోకి చేరలేదు. 

అజాదికాశాట్ ఉపగ్రహ వాహక నౌక నుంచి విడిపోయిందని.. కక్ష్యలోకి చేరిందా? లేదా అన్నది రాత్రికి కానీ తెలియదని ఇస్రో పేర్కొంది. రాకెట్ (ఎస్ఎస్ఎల్వీ), శాటిలైట్లకు సంబంధించి డేటాను విశ్లేషిస్తున్నామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ప్రకటించారు. రాకెట్ లోని వీటీఎం మాడ్యూల్ ఫంక్షన్ పనిచేయలేదని, దీంతో కక్ష్య వేగాన్ని సాధించడం సాధ్యపడలేదని, మొత్తంగా ఉపగ్రహాలు కక్ష్యను చేరుకోలేదని తెలుస్తోంది. కాకపోతే ఇస్రో పూర్తిస్థాయి విశ్లేషణ తర్వాతే ఫలితంపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News