Akasa Air: మరో కొత్త విమానయాన సంస్థ ‘ఆకాశ ఎయిర్’ సేవలు ఆరంభం
- ప్రారంభించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
- ముంబై-అహ్మదాబాద్ మార్గంలో తొలి సర్వీస్
- 12 నుంచి బెంగళూరు-కోచి మధ్య సర్వీసులు
ఎన్నో సవాళ్లతో, తీవ్ర పోటీతో కూడిన దేశీయ పౌర విమానయాన రంగంలోకి మరో కొత్త సంస్థ అడుగుపెట్టింది. ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ అయిన రాకేశ్ జున్ జున్ వాలా తెలిసే ఉంటుంది. ఆయన భాగస్వామ్యంతో ఏర్పాటైందే ఆకాశ ఎయిర్. ఈ సంస్థ తొలి విమాన సర్వీసును ఆదివారం ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రారంభించింది.
కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఆ శాఖ సహాయ మంత్రి విజయ్ కుమార్ సింగ్ జెండా ఊపి ఆకాశ ఎయిర్ సేవలను ప్రారంభించారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య వారంలో 28 ఫ్లయిట్ సర్వీసులను ఆకాశ ఎయిర్ నడపనుంది. ఆగస్ట్ 13 నుంచి బెంగళూరు-కోచి నగరాల మధ్య సేవలను మొదలు పెట్టనుంది. గతంలో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, జెట్ ఎయిర్ వేస్ తదితర ఎన్నో సంస్థలు విమాన సేవలను నష్టాలతో నడపలేక మూతవేయడం తెలిసిందే.