Narendra Modi: ​భారత సమాఖ్య వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది: నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ​

Modi speech at NITI AAYOG meeting

  • మోదీ ఆధ్వర్యంలో నీతి ఆయోగ్ సమావేశం
  • వ్యవసాయరంగాన్ని ఆధునికీకరించాలన్న మోదీ
  • పంటల వైవిధ్యంపై దృష్టి సారించాలని రాష్ట్రాలకు పిలుపు
  • వచ్చే ఏడాది జీ-20 సదస్సుకు ఆతిథ్యమిస్తున్నట్టు వెల్లడి

ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోదీ ప్రసంగించారు. వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగం పెరగాలని అన్నారు. పంటల వైవిధ్యంపై అన్ని రాష్ట్రాలు దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయ రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా భారత్ ఎదగాలంటూ బలమైన ఆకాంక్షను వ్యక్తం చేశారు.

ఇక, పెరుగుతున్న పట్టణీకరణను శక్తిగా మార్చుకోవాలని సూచించారు. వంటనూనెల ఉత్పత్తిలో దేశం స్వయంసమృద్ధి సాధించాలని తెలిపారు. భారత సమాఖ్య వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. వచ్చే ఏడాది జరిగే జీ-20 దేశాల సదస్సుకు భారత్ అధ్యక్షత వహిస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు. జీ-20 సమావేశాల నుంచి గరిష్ఠ ప్రయోజనాలు పొందాల్సి ఉందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News