India: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
- గత 24 గంటల్లో 16,167 కేసుల నమోదు
- మొన్నటితో పోలిస్తే 2571 కేసుల తగ్గుదల
- ప్రస్తుత క్రియాశీల కేసులు 1,35,510
భారత్ లో కరోనా వ్యాప్తి నియంత్రణలోకి వచ్చింది. కరోనా కేసులు కమ్రంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో తాజాగా 16,167 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొన్న 18,738 కొత్త కేసులు రాగా.. ఒక్క రోజులోనే 2571 కేసులు తగ్గాయి. అదే సమయంలో ఒక్క రోజులో 15,549 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే, వైరస్ వల్ల గత 24 గంటల్లో 41 మంది మృతిచెందారు. దాంతో, కరోనా వల్ల దేశంలో ఇప్పటిదాకా చనిపోయిన వారి సంఖ్య 5,26,730కి చేరుకుంది.
ప్రస్తుతం దేశంలో 1,35,510 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇప్పటిదాకా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,34,99,659కి చేరుకుంది. రికవరీ రేటు 98.50 శాతంగా నమోదైంది. క్రియాశీల రేటు 0.31 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.9 శాతంగా నమోదైంది. రోజువారీ పాటిజిటి రేటు మాత్రం 6.14 శాతంగా ఉంది. ఇక, దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 206,56,54,741 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 34,75,330 మందికి వ్యాక్సిన్ అందజేశారు.