- అవి పురుష పాత్రల ప్రాధాన్యం కలిగినవిగా అభివర్ణన
- సంప్రదాయ చిత్రాలను చేయకపోవడం వల్లే సక్సెస్ కాలేదన్న నటి
- గత నిర్ణయాలను సమీక్షించుకుంటే ఆశ్చర్యం కలుగుతుందన్న విద్యాబాలన్
ప్రముఖ నటి విద్యా బాలన్ తన కెరీర్ ఆరంభ రోజులను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తన నిర్ణయాలను పునశ్చరణ చేసుకుంటే ఆశ్చర్యకరంగా ఉందన్నారు. తాను నటించిన మొదటి ఏడు సినిమాలకు గాను, రెండు పెద్దగా సక్సెస్ కాలేదంటూ, అవి హీరో పాత్రల ప్రాధాన్యంగా తీసిన సినిమాలని చెప్పారు.
విద్యాబాలన్ 2005లో పరిణీత సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. 2006లో లగే రహో మున్నా భాయ్, 2007లో గురు, హే బేబీ, భూల్ భూలయ్యా, 2008లో కిస్మత్ కనెక్షన్, 2009లో 'పా' చిత్రాల్లో నటించింది. 2011లో డర్టీ పిక్చర్ లో పాత్రకు గాను ఆమెకు జాతీయ అవార్డు వరించింది.
‘‘ప్రజలు ఏం చెప్పాలనుకుంటున్నారనే దానికి నేను ప్రాధాన్యం ఇవ్వను. కానీ, నా నిర్ణయాలను తిరిగి సమీక్షించుకుంటే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది. సంప్రదాయ సినిమాలను చేయకపోవడం వల్లే నేను సక్సెస్ చూడకపోయి ఉండొచ్చు. నాకు అనుకున్న ఫలితాన్ని ఇవ్వని సినిమాలు మహిళా పాత్రల ప్రాధాన్యం కలిగినవి కావు’’ అని విద్యా బాలన్ తెలిపారు.