Nitin Gadkari: మంత్రులు చెబితే అధికారులు ‘యస్’ అనాల్సిందే: కేంద్రమంత్రి గడ్కరీ

Bureaucrats should only say yes sir to ministers Union Minister Nitin Gadkari

  • మంత్రులు చెప్పినదాన్ని బ్యూరోక్రాట్లు అమలు చేయాల్సిందేనన్న గడ్కరీ
  • వారు చెప్పినట్టుగా ప్రభుత్వం నడవదని స్పష్టీకరణ
  • పేదల సంక్షేమానికి చట్టాన్ని ఉల్లంఘించినా ఫర్వాలేదన్న మంత్రి

పాలనా వ్యవస్థలో మంత్రులదే అంతిమ అధికారమన్న విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధికారులకు తెలియజేశారు. మంత్రులు చెప్పిన దాన్ని బ్యూరోక్రాట్లు అమలు చేయాల్సిందేనన్నారు. ప్రభుత్వం మంత్రుల భాగస్వామ్యంతో పనిచేస్తుందన్న విషయాన్ని గుర్తు చేశారు. 

‘‘నేను తరచుగా అధికారులకు (బ్యూరోక్రాట్లు/ఐఏఎస్ లు) చెబుతుంటాను. మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం పనిచేయదు. మంత్రుల ఆదేశాలకు మీరు ‘యస్ సర్’ అని చెప్పాల్సిందే. మేము (మంత్రులం) చెప్పిన దానిని మీరు అమలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం మా ప్రకారం పనిచేస్తుంది’’ అని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గడ్కరీ అన్నారు.

ఏ చట్టం కూడా పేదల సంక్షేమానికి అడ్డుకాదన్న మహాత్మాగాంధీ మాటలను ప్రస్తావించారు. ‘‘ఏ చట్టం పేదల సంక్షేమానికి అడ్డుకాదన్నది నాకు తెలుసు. అవసరమైతే సదరు చట్టాన్ని పది సార్లు ఉల్లంఘించాల్సి వచ్చినా వెనుకాడేది లేదు. మహాత్మాగాంధీ అదే చెప్పారు’’ అని గడ్కరీ వివరించారు.

  • Loading...

More Telugu News