Raju Srivastava: గుండెపోటుకు గురైన బాలీవుడ్ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవకి వెంటిలేటర్ పై చికిత్స

Raju Srivastava health update Comedian is on ventilator
  • త్రెడ్ మిల్ చేస్తుండగా ఛాతీ నొప్పి  
  • ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిక
  • రెండుసార్లు సీపీఆర్ చేసిన వైద్యులు
  • చికిత్సకు స్పందిస్తున్నట్టు వైద్యుల ప్రకటన  
ప్రముఖ బాలీవుడ్ హాస్య నటుడు, స్టాండప్ కమెడియన్, ఉత్తరప్రదేశ్ ఫిల్మ్ బోర్డ్ చైర్మన్ రాజు శ్రీవాస్తవ తీవ్రమైన గుండెపోటుతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. నిన్న ఉదయం జిమ్ లో త్రెడ్ మిల్ పై నడుస్తున్న సమయంలో ఆయనకు ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. జిమ్ శిక్షకుడు వెంటనే శ్రీవాస్తవను ఎయిమ్స్ కు తరలించారు. వైద్యులు రెండు విడతలుగా సీపీఆర్ ప్రక్రియ చేసి ఆయన గుండె మళ్లీ పనిచేసేలా చూశారు. 

చికిత్సకు ఆయన స్పందిస్తున్నట్టు ఎయిమ్స్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. వెంటిలేటర్ పై ఉంచినట్టు, క్లినికల్ ట్రీట్ మెంట్ కు ఆయన స్పందిస్తున్నట్టు ఎయిమ్స్ తెలిపింది. ఆయనకు యాంజీయోప్లాస్టీ చేసినట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని రాజు శ్రీవాస్తవ సోదరుడు ఆశిష్ శ్రీవాస్తవ ధ్రువీకరించారు. 

Raju Srivastava
Comedian
heart attck
aiims
delhi
ventilator

More Telugu News