Congress: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కు ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం
- ద లెజియన్ ఆఫ్ ఆనర్ ప్రదానం
- థరూర్ రచనలు, ప్రసంగాలకు గాను వరించిన అవార్డు
- ట్విట్టర్లో అభినందనల వర్షం
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఫ్రాన్స్ కు చెందిన అత్యున్నత పౌర పురస్కారం ‘ద లెజియన్ ఆఫ్ ఆనర్’ ను అందుకున్నారు. థరూర్ రచనలు, ప్రసంగాలకు గాను ఈ అవార్డు వరించింది. దీంతో ట్విట్టర్లో థరూర్ కు ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనిపై థరూర్ సైతం స్పందించారు.
‘‘ధన్యవాదాలు. ఫ్రాన్స్ తో మన సంబంధాలను గౌరవించే, సంస్కృతి, భాషా ప్రేమికుడిగా నేను ఈ గౌరవాన్ని పొందడం పట్ల సంతోషంగా ఉంది. ఈ అవార్డుకు నేను తగిన వ్యక్తిని అని గుర్తించిన వారికి నా కృతజ్ఞతలు మరియు అభినందనలు’’ అని ధరూర్ ట్వీట్ చేశారు.
2010లో థరూర్ స్పెయిన్ ప్రభుత్వం నుంచి ఇదే విధమైన గౌరవాన్ని (కింగ్ ఆఫ్ స్పెయిన్) అందుకున్నారు. తిరువనంతపురం లోక్ సభ స్థానానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రచనల్లో థరూర్ కు మంచి నైపుణ్యం ఉంది. అరుదైన ఇంగ్లిష్ పదాలను కూడా ఆయన అప్పుడప్పుడు పరిచయం చేస్తుంటారు.