Moto G62 5G: ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చేసిన మోటో జీ62 5జీ

Moto G62 5G launched in India price starts from Rs 17999

  • స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్
  • 50 మెగాపిక్సల్ కెమెరా
  • సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
  • పలు బ్యాంకు కార్డులపై రూ.1,500 వరకు తగ్గింపు

మోటరోలా ఇటీవలి కాలంలో వరుసబెట్టి కొత్త ఫోన్లను ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేస్తోంది. అన్ని రకాల ధరల శ్రేణిలో మోటో ఫోన్ ఉండాలన్న వ్యూహంతో పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా మోటో జీ62 5జీ ఫోన్ ను విడుదల చేసింది. రెండు రకాల వేరియంట్లలో లభిస్తుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.17,999. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.19,999. 

ఫ్లిప్ కార్ట్ వేదికపై ఇది విక్రయాలకు అందుబాటులో ఉంటుంది. హెచ్ డీఎఫ్ సీ కార్డుపై కొనుగోలు చేస్తే రూ.1,500 తక్షణ డిస్కౌంట్ ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. బ్యాంకు ఆఫ్ బరోడా, సిటీ బ్యాంకు కార్డుదారులకు 10 శాతం తగ్గింపు ఇస్తోంది. ఈ ఫోన్లో 6.55 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే, ఫుల్ హెచ్ డీతో ఉంటుంది. 120 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. దీనికి ఐపీ52 రేటింగ్ కూడా ఉంది. దీంతో నీరు, దుమ్ము నుంచి ఫోన్ కు రక్షణ లభిస్తుంది. అంటే నీటి బిందువులు పడినా ఫోన్ కు ఏమీ కాదు. కానీ నీటిలో పడిపోతే రక్షణ ఉండదు.

ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉంటాయి. వాటిల్లో ప్రధాన కెమెరా 50 మెగాపిక్సల్ తో ఉంటుంది. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్ ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో పనిచేస్తుంది. ఒక ఆండ్రాయిడ్ వెర్షన్ కు భవిష్యత్తులో అప్ గ్రేడ్ కావచ్చు. ఫోన్ పక్క భాగంలో ఫింగర్ ప్రింట్ (సైడ్ మౌంటెడ్) సెన్సార్ ఉంటుంది.

  • Loading...

More Telugu News