Team India: జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
- ఈ నెల 18 నుంచి మొదలు కానున్న సిరీస్
- హరారే వేదికగా 3 వన్డేలు
- వైస్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్
- జట్టులోకి వచ్చిన మహ్మద్ సిరాజ్
జింబాబ్వేతో ఈ నెల 18 నుంచి మొదలు కానున్న వన్డే సిరీస్‌కు టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ అందుబాటులోకి వచ్చాడు. అంతేకాకుండా ఈ సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా రాహుల్‌ను ఎంపిక చేస్తూ బీసీసీఐ గురువారం నిర్ణయం తీసుకుంది. జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న టీమిండియా ఆతిథ్య జట్టుతో 3 వన్డేలు ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్ వ్యవహరించనున్నాడు. సిరీస్‌లోని 3 వన్డేలు జింబాబ్వేలోని హరారేలో జరగనున్నాయి.
ఇక ఈ సిరీస్‌కు భారత జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. కేఎల్ రాహుల్ నేతృత్వంలో బరిలోకి దిగనున్న భారత జట్టులో శిఖర్ ధావన్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్‌లు ఉన్నారు.