Gudivada Amarnath: నన్ను ‘రెడ్డి’ని చేయొద్దు ప్లీజ్: మంత్రి గుడివాడ అమర్‌నాథ్

dont add Reddy to my name asks minister gudivada amarnath
  • ఈ నెల 16న అచ్యుతాపురంలో టైర్ల కంపెనీని ప్రారంభించనున్న జగన్
  • ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అమర్‌నాథ్
  • అపాచీ కంపెనీ ప్రారంభోత్సవం సందర్భంగా తనను అందరూ రెడ్డిగానే పిలిచారన్న మంత్రి
తన పేరు వెనక ‘రెడ్డి’ చేర్చి తనను రెడ్డిగా మార్చొద్దని ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కోరారు. కొందరు అవగాహన లేకుండా అలా పిలిచి తనను రెడ్డిని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని ప్రత్యేక ఆర్థిక మండలిలో నెలకొల్పిన ఏటీజీ టైర్ల కంపెనీని ఈ నెల 16న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు నిన్న మంత్రి కంపెనీలో పర్యటించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆహ్వానం పలికే వారికి అవగాహన లేకపోవడం వల్ల తన పేరు వెనక రెడ్డి తగిలిస్తున్నారని అన్నారు. తిరుపతిలోని అపాచీ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఈవో, జపాన్ ప్రతినిధులు అందరూ తనను అమర్‌నాథ్‌రెడ్డిగానే సంబోధించారని గుర్తు చేశారు. కాబట్టి టైర్ల కంపెనీ ప్రారంభోత్సవంలో ఇలాంటి తప్పు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు.  
Gudivada Amarnath
Anakapalle
Atchutapuram
YSRCP

More Telugu News