Aamir Khan: ‘లాల్​ సింగ్​ చడ్డా’ను గుర్తించిన ఆస్కార్

Oscars official page honours Aamir Khans Laal Singh Chaddha in special way
  • హాలీవుడ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’ చిత్రానికి రీమేక్ గా వచ్చిన హిందీ చిత్రం
  • ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన సినిమాకు మోస్తరు స్పందన
  • ‘ఫారెస్ట్ గంప్’, ‘లాల్ సింగ్ చడ్డా’ ను పోలుస్తూ ట్విట్టర్ లో వీడియో షేర్ చేసిన అస్కార్
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విడుదలైన ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. ఆమిర్ గత చిత్రాలతో పోలిస్తే తొలి రోజు చాలా తక్కువ వసూళ్లు రాబట్టింది. సమీక్షలు కూడా వ్యతిరేకంగా వచ్చాయి. మరోవైపు ఈ సినిమాను బహిష్కరించాలంటూ సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరుగుతోంది. ఇన్ని ప్రతికూలతల నడుమ ఆమిర్ ఖాన్ కు ‘ఆస్కార్’ నుంచి కొంత సాంత్వన లభించింది. 

టామ్ హాంక్స్ తీసిన హాలీవుడ్ క్లాసిక్‘ఫారెస్ట్ గంప్’కు అధికారిక హిందీ రీమేక్ అయిన ‘లాల్ సింగ్ చడ్డా’ను ఆస్కార్ గుర్తించింది. సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా మద్దతు తెలిపింది. అస్కార్ అవార్డు పొందిన ఒరిజినల్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ మ్యాజిక్ ను హిందీలో తిరిగి ఎలా సృష్టించారో వివరించేలా వీడియో క్లిప్ ను షేర్ చేసింది.

‘రాబర్ట్ జెమెకిస్, ఎరిక్ రోత్ అందించిన కథ భారతీయుల ఆదరణ కూడా పొందింది. ఈ కథను అద్వైత్ చందన్‌, అతుల్ కులకర్ణి భారతీయతకు తగ్గట్టు మార్చుకున్నారు’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోలో రెండు చిత్రాల సన్నివేశాలను పోల్చింది. ఒరిజినల్ చిత్రంలోని సన్నివేశాలను ఎలా పునర్నిర్మించారో కూడా క్లిప్ చూపించింది. 

కాగా, 1994లో విడుదలైన ఫారెస్ట్ గంప్ చిత్రం 13 ఆస్కార్‌లకు నామినేట్ అయిందని కూడా వివరించింది. ఈ చిత్రం ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఫిల్మ్ ఎడిటింగ్, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే మరియు ఉత్తమ చిత్రంగా ఆరు అస్కార్ అవార్డులు గెలిచింది.
Aamir Khan
lal singh chaddah
oscar
Twitter

More Telugu News