Ram Temple: వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి అయోధ్య రాముడి దర్శనం.. అయోధ్య ట్రస్టు వెల్లడి!

Ram temple construction to be completed by december next year

  • నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు
  • అద్భుతమైన శైలిలో రామాలయ నిర్మాణం కొనసాగుతోందని వివరణ
  • రాముడి దర్శనం కోసం అందరినీ ఆహ్వానిస్తున్నట్టు వెల్లడి

అయోధ్యలోని రామ జన్మభూమిలో రామాలయం పనులు శరవేగంగా సాగుతున్నాయని.. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి భక్తుల దర్శనాల కోసం సిద్ధమవుతుందని అయోధ్య ట్రస్టు తెలిపింది. ఆలయ నిర్మాణం అద్భుతంగా కొనసాగుతోందని.. ఎక్కడా ఇనుము వాడకుండా రాతితో నిర్మిస్తున్నామని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. అయోధ్య సమీపంలోని సుల్తాన్ పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

అందరినీ ఆహ్వానిస్తున్నా..
‘‘సుల్తాన్ పూర్ అయోధ్యకు సమీపంలోనే ఉంది. వచ్చే ఏడాది డిసెంబర్ లో శ్రీరాముడి దర్శనానికి రావాలని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. అయోధ్య రామాలయం నిర్మాణం శర వేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటి కల్లా దర్శనాలకు సిద్ధమవుతుంది..” అని చంపత్ రాయ్ పేర్కొన్నారు. అద్భుతమైన శైలిలో రామాలయ నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు.

  • Loading...

More Telugu News