Andhra Pradesh: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

Moderate Rains Expected in Coastal AP

  • నేడు వాయుగుండంగా బలపడే అవకాశం
  • ఏపీ, యానాంలో పడమర గాలుల ప్రభావం
  • ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న ఉదయం 8.30 గంటలకు ఏర్పడిన ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా  కదలుతోంది. నేడు ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. 

అలాగే, ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో పడమర గాలుల ప్రభావం ఉంది. ఫలితంగా కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు కురవడంతోపాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వివరించింది.

  • Loading...

More Telugu News