CPI Ramakrishna: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీని రక్షించడమే ప్రభుత్వ ధ్యేయమా?: సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna fires in AP Govt

  • తిరుపతిలో రామకృష్ణ మీడియా సమావేశం
  • ఏపీ ప్రభుత్వంపై విమర్శలు
  • ఎంపీ మాధవ్ అంశం, ఎమ్మెల్సీ అనంతబాబు అంశం ప్రస్తావన

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీ (గోరంట్ల మాధవ్)ని రక్షించడమే ప్రభుత్వ ధ్యేయమా? అని ప్రశ్నించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో అది నకిలీ వీడియో అని ఎస్పీ ఫకీరప్ప తేల్చేశారని వెల్లడించారు. ఎలాంటి విచారణ లేకుండా ఎస్పీ అది ఫేక్ వీడియో అని ఎలా చెప్పగలరని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎంపీపై చర్యలు తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 

అటు, హత్య చేసిన ఎమ్మెల్సీ (అనంతబాబు)ని కాపాడడమే ప్రభుత్వ ధ్యేయమా? అని నిలదీశారు. 90 రోజుల్లో చార్జిషీటు వేయకుండా ఎమ్మెల్సీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ వచ్చేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. అనంతబాబు కేసులో ప్రభుత్వ వైఫల్యంపై ఉద్యమిస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు. వ్యక్తిని చంపి కారులో డోర్ డెలివరీ ఇచ్చిన ఎమ్మెల్సీపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమ అని నిలదీశారు.

  • Loading...

More Telugu News