Mahindra: అదిరిపోయే రేంజిలో మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు... ఫొటోలు ఇవిగో!
- ఈవీ రంగంలో పట్టు కోసం మహీంద్రా యత్నాలు
- బోర్న్ ఎలక్ట్రిక్ శ్రేణిని పరిచయం చేసిన వైనం
- 2027 నాటికి 2 లక్షల అమ్మకాలే లక్ష్యం
భారత దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోనూ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో ఒకేసారి ఐదు ఎలక్ట్రిక్ మోడళ్లను ఆవిష్కరించింది. ఎక్స్ యూవీ, బీఈ (బోర్న్ ఎలక్ట్రిక్) బ్రాండ్ల కింద ఈ మోడళ్లను ప్రదర్శించింది. ఎక్స్ యూవీ బ్రాండ్ ఇప్పటికే మార్కెట్లో ఉండగా, బీఏ కొత్త బ్రాండ్. ఎక్స్ యూవీ.ఈ8, ఎక్స్ యూవీ.ఈ9, బీఈ.05, బీఈ.07, బీఈ.09 మోడళ్లను మహీంద్రా ఇవాళ ఆటోమొబైల్ రంగానికి పరిచయం చేసింది. వీటిలో పలు మోడళ్లను 2024 నుంచి 2026 మధ్యన మార్కెట్లోకి తీసుకురానుంది. 2027 నాటికి 2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాలని మహీంద్రా భావిస్తోంది.