CM KCR: ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గైర్హాజరు!
- నేడు స్వాతంత్ర్య దినోత్సవం
- రాజ్ భవన్ లో ఎట్ హోమ్
- తేనీటి విందు ఏర్పాటు చేసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
- చివరి నిమిషంలో ఎట్ హోమ్ కు కేసీఆర్ దూరం
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్ హోమ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి రావాల్సిన సీఎం కేసీఆర్ చివరి నిమిషంలో మనసు మార్చుకున్నట్టు తెలిసింది. ఆయన ఎట్ హోమ్ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.
వాస్తవానికి సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి వస్తున్నారని రాజ్ భవన్ వర్గాలకు సీఎంవో నుంచి సమాచారం అందింది. అయితే, ఈ కార్యక్రమానికి కేసీఆర్ దూరం కాగా, సీఎస్ సోమేశ్ కుమార్, మరికొందరు ఉన్నతాధికారులు మాత్రమే ప్రభుత్వం తరఫున ఎట్ హోమ్ లో పాల్గొన్నారు. మంత్రులు, ఇతర టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో కనిపించలేదు.