COVID19: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Corona cases have reduced in the country

  • తాజాగా 8,813 కొత్త కేసుల నమోదు
  • మొన్నటి కంటే 6 వేల కేసులు తగ్గుదల
  • వైరస్ తో తాజాగా 24 మంది మృతి

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో  8,813 కొత్త కేసులు నమోదయ్యాయి. మొన్నటితో పోలిస్తే 6,256 కేసులు తగ్గడం గమనార్హం. ఇదే సమయంలో తాజాగా 15,040 మంది వైరస్ నుంచి కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం ప్రకటించింది. గత 24 గంటల్లో వైరస్ వల్ల 24 మంది చనిపోయారని వెల్లడించింది. దాంతో, భారత్ లో కరోనా మరణాల సంఖ్య 5,27,098కి చేరుకుంది. 

ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 1,11,252కి చేరుకుంది. క్రియాశీల రేటు 0.25 శాతంగా ఉంది. రోజువారి పాజిటివిటీ రేటు 4.15 శాతంగా నమోదైంది. రికవరీ రేటు మాత్రం 98.56 శాతంగా ఉంది. కరోనా నుంచి ఇప్పటిదాకా 4,36,38,844 మంది కోలుకున్నారు. 

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ విస్తృతంగా కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటిదాకా 208,31,24,694 డోసుల వ్యాక్సిన్లు అందజేసినట్టు వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 6,10,863 డోసులు పంపిణీ చేసినట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News