Kottu Satyanarayana: అర్చకుల అధీనంలోని భూముల పర్యవేక్షణ దేవాదాయశాఖదే: ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ

Minister Kottu Satyanarayana press meet

  • భూములపై ఫలసాయం మాత్రమే అర్చకులకు చెందుతుందని వెల్లడి
  • దేవాదాయ శాఖ అధీనంలో 4.2 లక్షల ఎకరాలు
  • కొన్ని భూములు ఆక్రమణలో ఉన్నాయన్న మంత్రి
  • దేవాదాయ శాఖలో ఉద్యోగుల కొరత ఉందని వెల్లడి

ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్చకుల అధీనంలోని భూముల పర్యవేక్షణ బాధ్యత దేవాదాయశాఖదేనని స్పష్టం చేశారు. భూముల ఫలసాయం మాత్రమే అర్చకులు అనుభవించవచ్చని వివరించారు. దేవుడి మాన్యం భూములపై హక్కులు దేవాదాయ శాఖకు చెందుతాయని వెల్లడించారు. దేవాదాయ శాఖ అధీనంలో 4.2 లక్షల ఎకరాల భూమి ఉందని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ భూముల్లో కొన్ని ఆక్రమణలో ఉన్నాయని అన్నారు. దేవుడి మాన్యాల్లో ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 

మఠాలు, పీఠాల భూముల లీజు, పొడిగింపు తదితర వ్యవహారాలను ధార్మిక పరిషత్ చూసుకుంటోందని వెల్లడించారు. రాష్ట్రంలో 3,500 ఆలయాలు ధూపదీప నైవేద్యాలకు నిధులు కోరాయని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి గుడికి ధూపదీప నైవేద్యం పథకం కింద నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.

ఇక దేవాదాయ శాఖలో ఉద్యోగుల కొరత ఉందని, నిబంధనల ప్రకారమే రెవెన్యూ శాఖ సిబ్బందిని తీసుకుంటున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.

  • Loading...

More Telugu News