Vijay: మద్రాస్ హైకోర్టులో హీరో విజయ్ కు స్వల్ప ఊరట
- విజయ్ కు రూ. 1.50 కోట్ల జరిమానా విధించిన ఐటీ శాఖ
- 'పులి' చిత్రం రెమ్యునరేషన్ ను ఐటీ లెక్కల్లో చూపించలేదని ఆరోపణ
- ఐటీ ఉత్తర్వులపై స్టే విధించిన మద్రాస్ హైకోర్టు
తమిళ స్టార్ హీరో విజయ్ కు మద్రాసు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆయనకు ఐటీ శాఖ రూ. 1.50 కోట్ల జరిమానా విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది. కేసు వివరాల్లోకి వెళ్తే... 'పులి' చిత్రం ద్వారా లభించిన రూ. 15 కోట్ల రెమ్యునరేషన్ ను దాచిపెట్టి 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రిటర్న్స్ ను విజయ్ దాఖలు చేశారనే కారణంతో ఆదాయపు పన్ను శాఖ జరిమానా విధించింది.