KCR: మహారాష్ట్రలో కూడా నేడు జాతీయ గీతాలాపన
- నిన్న మధ్యాహ్నం తెలంగాణ వ్యాప్తంగా జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించిన టీఆర్ఎస్ ప్రభుత్వం
- అబిడ్స్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్
- ఈరోజు 11 గంటలకు మహారాష్ట్రలో జాతీయ గీతాలాపన కార్యక్రమం
75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను యావత్ దేశం ఘనంగా నిర్వహించింది. సామాన్యుడు, సంపన్నుడు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. మరోవైపు నిన్న మధ్యాహ్నం 11.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా జాతీయ గీతాలాపన జరిగిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా హైదరాబాదులోని రహదారులపై సైతం ఆ సమయంలో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. రోడ్లమీదే వాహనదారులు జాతీయగీతాన్ని ఆలపించారు. అబిడ్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో కేసీఆర్ జాతీయగీతాన్ని ఆలపించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇప్పుడు కేసీఆర్ బాటలోనే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా నడుస్తోంది. ఈరోజు 11 గంటలకు మహారాష్ట్ర వ్యాప్తంగా జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.