Chandrababu: సమరానికి చంద్రబాబు సన్నాహాలు... నియోజకవర్గ ఇన్చార్జిలతో విడివిడిగా భేటీలు

Chandrababu takes on one to one meetings with constituency incharges

  • రోజుకు ఐదు నియోజకవర్గాల సమీక్ష
  • ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలకు సమాచారం
  • వన్ టు వన్ పద్ధతిలో ఒక్కొక్కరితో మాట్లాడనున్న చంద్రబాబు
  • పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం

ఏపీలో ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉన్నా, టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటినుంచే సమర సన్నాహాలు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. నేటి నుంచి నియోజకవర్గాల టీడీపీ ఇన్చార్జిలతో సమావేశం కానున్నారు. అవనిగడ్డ, మార్కాపురం, సంతనూతలపాడు, పెనమలూరు, గుంటూరు (ఈస్ట్) పార్టీ ఇన్చార్జిలతో ఒక్కొక్కరితో విడిగా మాట్లాడనున్నారు. నియోజకవర్గ పరిస్థితులు, పార్టీ బలాబలాలు, రాజకీయ పరిణామాలపై వారితో చర్చించనున్నారు. 

రోజుకు ఐదు నియోజక వర్గాలను సమీక్షించాలని టీడీపీ అధినేత భావిస్తున్నారు. ఆ మేరకు నియోజకవర్గాల టీడీపీ ఇన్చార్జిలకు సమాచారం అందించారు. నియోజకవర్గంలో పార్టీలోనే ఎవరైనా వ్యతిరేకులు ఉన్నారా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఆశావహులు ఎవరు? వంటి అంశాలను ఈ వన్ టు వన్ సమావేశాల్లో చర్చించనున్నారు. నియోజకవర్గాల ఇన్చార్జిలకు అమరావతి పార్టీ కార్యాలయంలోనే లంచ్ లేదా డిన్నర్ ఏర్పాటు చేయనున్నారు. వారితో ఆత్మీయంగా మాట్లాడి నియోజకవర్గాలకు సంబంధించిన లోటుపాట్లను తెలుసుకోవడమే ఈ వన్ టు వన్ సమావేశాల ఉద్దేశంగా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News