Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్‌కు గవర్నర్ గిరీ.. బీజేపీ ఆఫర్‌కు సానుకూలంగా స్పందించిన రజనీ?

BJP Offers Super Star Rajinikanth Governor post

  • తమిళనాడులో బలపడాలని చూస్తున్న బీజేపీ
  • ఇటీవల మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తో రజనీకాంత్ భేటీ
  • ఆ తర్వాతి రోజు తమిళనాడు గవర్నర్‌తోనూ సమావేశం
  • గవర్నర్ పదవి అయితే ఏ పార్టీలోనూ చేరే పని ఉండదన్న ఉద్దేశంతోనే రజనీకాంత్ అంగీకారం!

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడో వార్త తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రముఖ నటుడు రజనీకాంత్‌కు గవర్నర్ పదవి దక్కబోతోందన్నదే ఆ వార్త. తమిళనాడులో బలపడాలని చూస్తున్న రజనీకాంత్‌కు గవర్నర్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టు వార్తలు గుప్పుమన్నాయి.

 బీజేపీ ఆఫర్‌కు రజనీకాంత్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. రజనీకాంత్ ఇటీవల వేస్తున్న అడుగులు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. 75వ స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొన్న రజనీకాంత్ అనంతరం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాతి రోజే తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవితో భేటీ అయ్యారు. 

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఆయనకు గవర్నర్ పదవి ఖాయమని చెబుతున్నారు. నిజానికి ప్రధానమంత్రి రజనీకాంత్‌తో మోదీకి మంచి స్నేహం ఉంది. ప్రధాని చెన్నై వచ్చినప్పుడు రజనీకాంత్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబంతో సరదాగా గడిపారు. కాగా, బీజేపీ గవర్నర్ గిరీ ఆఫర్‌కు రజనీకాంత్ కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. గవర్నర్ పదవి అయితే ఏ పార్టీలోనూ చేరాల్సిన పని ఉండదన్న ఉద్దేశంతోనే ఆయనీ ఆఫర్‌కు అంగీకరించినట్టు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News