Realme: 28 గంటల ప్లేబ్యాక్ టైం, నాయిస్ క్యాన్సలేషన్ తో రియల్ మీ టెక్ లైఫ్ టీ100 ఇయర్ బడ్స్!
- ఆగస్టు 24 నుంచి విక్రయించనున్నట్టు ప్రకటించిన 'రియల్ మీ' సంస్థ
- మంచి బ్యాటరీ లైఫ్.. గరిష్ఠ ధ్వనితో ఆనందించవచ్చని వెల్లడి
- గేమ్స్ ఆడే వారికి అద్భుత అనుభూతిని ఇస్తాయన్న సంస్థ
- ప్రవేశ ఆఫర్ కింద కొన్ని రోజులు రూ.1,299కే విక్రయించనున్నట్టు ప్రకటన
స్మార్ట్ ఫోన్లు, ఇయర్ ఫోన్ల ఉత్పత్తుల్లో దూసుకుపోతున్న రియల్ మీ సంస్థ.. సరికొత్త వైర్ లెస్ ఇయర్ బడ్స్ ను విడుదల చేసింది. తన సబ్ బ్రాండ్ రియల్ మీ టెక్ లైఫ్ పేరిట ‘టెక్ లైఫ్ బడ్స్ టీ 100’ మోడల్ నంబర్ తో ఇండియా మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇవి ట్రూ వైర్ లెస్ స్టీరియో (డీడబ్ల్యూఎస్) ఇయర్ బడ్స్ అని.. వినియోగదారులకు అద్భుతమైన మ్యూజిక్ అనుభూతిని ఇస్తాయని సంస్థ ప్రకటించింది. ఇవి ఏకంగా 28 గంటల పాటు ప్లే టైం అందిస్తాయని పేర్కొంది.
టెక్ లైఫ్ టీ 100 ఇయర్ బడ్స్ ప్రత్యేకతలు ఇవీ..
- టీడబ్ల్యూఎస్ రకానికి చెందిన ఈ ఇయర్ బడ్స్ రెండు రంగులు ‘తెలుగు–బూడిద’, ‘నలుపు–పసుపు’ కాంబినేషన్లలో లభిస్తాయని రియల్ మీ వెల్లడించింది.
- 10 ఎంఎం (మిల్లీమీటర్ల) డైనమిక్ డ్రైవర్స్ తో.. గరిష్ఠంగా 97 డెసిబుల్స్ వరకు ధ్వనిని వినవచ్చని.. యాప్ లోని వాల్యూమ్ ఎన్ హాన్సర్ ఆప్షన్ తో గరిష్ఠ ధ్వనిని 102 డెసిబుల్స్ వరకు పెంచుకోవచ్చని తెలిపింది.
- బ్లూటూత్ 5.3 వెర్షన్ తో గరిష్ఠంగా 10 మీటర్ల వరకు కనెక్టివిటీ సదుపాయం ఉంటుందని వివరించింది.
- ఫోన్ నుంచి ఇయర్ బడ్స్ కు కనెక్టివిటీ (లేటెన్సీ) అత్యంత వేగంగా 88 మిల్లీ సెకన్లుగా ఉంటుందని.. ఇది గేమ్స్ ఆడే వారికి అత్యుత్తమ ధ్వని అనుభూతిని ఇస్తుందని రియల్ మీ సంస్థ పేర్కొంది.
- వీటిలో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఎన్విరాన్ మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్ (ఈఎన్ సీ) సదుపాయం ఉందని తెలిపింది. దీనివల్ల ఫోన్ కాల్స్ లో అత్యంత స్పష్టత ఉంటుందని పేర్కొంది.
- ఇయర్ బడ్స్ పై ఉండే టచ్ బటన్స్ సాయంతో సౌండ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం.. కాల్స్ రిసీవ్, రిజెక్ట్ చేయడం వంటి సులభంగా చేసుకోవచ్చని తెలిపింది.
- ఇయర్ బడ్స్ లోని బ్యాటరీతోపాటు చార్జింగ్ కేస్ లోని బ్యాటరీ కలిపి.. 28 గంటల పాటు ప్లే టైం ఉంటుందని వివరించింది. కేవలం పది నిమిషాల చార్జింగ్ తో రెండు గంటల పాటు ప్లే బ్యాక్ అయ్యేలా ఫాస్ట్ చార్జింగ్ వెసులుబాటు ఉందని వివరించింది.
- వీటి ధర రూ.1,499 కాగా.. ప్రవేశ ఆఫర్ కింద కొన్ని రోజుల పాటు రూ.1,299కే విక్రయించనున్నట్టు ప్రకటించింది.
- ఆగస్టు 24వ తేదీ నుంచి వీటిని రియల్ మీ వెబ్ సైట్ తోపాటు ఇతర ఈ కామర్స్ సైట్లలో విక్రయించనున్నట్టు తెలిపింది. త్వరలో ఈ ఇయర్ బడ్స్ ను జాజ్ బ్లూ, రాక్ రెడ్ రంగుల్లోనూ విడుదల చేస్తామని తెలిపింది.