Smart phone: ర్యామ్ బూస్టింగ్ తో వివో వై22ఎస్.. స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు ఇవీ
- 50 మెగాపిక్సెల్ కెమెరా.. 6.55 అంగుళాల డిస్ ప్లేతో ఫోన్
- 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.. యూఎస్ బీ టైప్ సీ ఆధారిత చార్జింగ్ పోర్టు
- త్వరలోనే విడుదల చేయనున్నట్టు పేర్కొన్న వివో సంస్థ
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తమ బడ్జెట్ శ్రేణిలో మరో కీలకమైన ఫోన్ ‘వివో వై22 ఎస్’ మోడల్ ను ఆవిష్కరించింది. తక్కువ ధరలో మంచి అనుభూతిని ఇచ్చేలా ఈ ఫోన్ ను డిజైన్ చేసినట్టు తమ వెబ్ సైట్లో ప్రకటించింది. అత్యాధునిక స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ తో ర్యామ్ బూస్టింగ్ టెక్నాలజీతో ఈ ఫోన్ ను ప్రవేశపెడుతున్నట్టు తెలిపింది. ఉత్తమమైన ప్రాసెసర్ కు ర్యామ్ బూస్టింగ్ టెక్నాలజీ వల్ల.. యాక్టివ్ గా ఉన్న యాప్ ల మధ్య వేగంగా మారిపోవచ్చని.. ఎలాంటి ల్యాగింగ్ ఉండబోదని పేర్కొంది. త్వరలోనే భారత మార్కెట్లో ఈ ఫోన్ విక్రయాలను ప్రారంభిస్తామని ప్రకటించింది.
వివో వై 22 ఎస్ ప్రత్యేకతలు ఇవీ..
- వివో సంస్థ తమ వెబ్ సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రాసెసర్ ను ఈ ఫోన్ లో అమర్చారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను పొందుపరిచారు.
- 6.55 అంగుళాల ఫుల్ హెచ్ డీ భారీ డిస్ప్లేతో.. వాటర్ డ్రాప్ ఆకారంలోని ఫ్రంట్ కెమెరాను అమర్చారు.
- వెనుక వైపున 50 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అమర్చారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.
- గరిష్ఠంగా 128 జీబీ మెమరీ వరకు మోడళ్లు అందుబాటులో ఉంటాయి. ఎస్ డీ కార్డు సాయంతో 2 టీబీ వరకు మెమరీని పెంచుకోవచ్చు.
- 8 జీబీ ర్యామ్ నుంచి 12 జీబీ ర్యామ్ వరకు వివిధ మోడళ్లు అందుబాటులో ఉంటాయి. ర్యామ్ బూస్టింగ్ టెక్నాలజీతో ఫోన్ లోని ఇన్ బిల్ట్ మెమరీలో కొంత భాగాన్ని అవసరమైనప్పుడు ర్యామ్ లా ఉపయోగించుకుని వేగంగా పనిచేస్తుంది.
- 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. యూఎస్ బీ టైప్ సీ ఆధారిత చార్జింగ్ పోర్టు ఇచ్చారు.
- వైఫై, బ్లూటూత్ 5, జీపీఎస్, ఎన్ ఎఫ్ సీ, ఎఫ్ ఎం రేడియో, ఓటీజీ వంటి సదుపాయాలు, ఇతర అత్యవసర సెన్సర్లు అన్నింటినీ ఫోన్ లో పొందుపరిచారు.
- ఫోన్ అంచుల వైపు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. ఫోన్ 192 గ్రాముల బరువు ఉంటుందని వివో సంస్థ తెలిపింది.
- ఈ ఫోన్ ను ఆవిష్కరించిన కంపెనీ.. దాని విడుదల తేదీ, ధర వివరాలను అధికారికంగా వెల్లడించలేదు.
- ప్రస్తుతం వివో వీ 25 సిరీస్ ఫోన్ ను విడుదల చేయనున్న నేపథ్యంలో.. కొన్ని రోజుల్లోనే వివో వై 22 ఎస్ మోడల్ ను విడుదల చేయవచ్చని.. ధరలు రూ.12 వేల నుంచి ప్రారంభం కావొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.