COVID19: దేశంలో లక్ష దిగువకు కరోనా యాక్టివ్ కేసులు

 COVID19 Active caseload at 99879

  • ప్రస్తుతం దేశంలో 99,879 క్రియాశీల కేసులు 
  • గత 24 గంటల్లో 11,539  పాజిటివ్ కేసులు నమోదు
  • వైరస్ వల్ల తాజాగా 34 మంది మృతి

దేశంలో కరోనా ఉద్ధృతి నిలకడగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 3,07,680 మందికి టెస్టులు చేయగా కొత్తగా 11,539 కేసులు నమోదయ్యాయి. మొన్నటితో పోలిస్తే 1287 కేసులు తగ్గాయి. క్రియాశీల కేసుల సంఖ్య లక్ష దిగువకు పడిపోయింది. ప్రస్తుతం దేశంలో 99,879 క్రియాశీల కేసులు ఉన్నాయి. కరోనా వైరస్ వల్ల తాజాగా 34 మంది మృతి చెందారు. దాంతో, దేశంలో కరోనా మృతుల సంఖ్య 5,27,332కి చేరుకుంది.

గత 24 గంటల్లో 12,783 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దాంతో, దేశంలో  ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య  4,37,12,218కి చేరుకుంది. రికవరీ రేటు 98.59గా ఉంది. క్రియాశీల రేటు 0.23 శాతంగా నమోదైంది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటిదాకా 209,67,06,895 కరోనా వ్యాక్సిన్ డోసులు అందజేశారు. నిన్న ఒక్క రోజే 26,58,755 మందికి వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.

  • Loading...

More Telugu News