Madhu Yaskhi: ఆధారాలు తారుమారు చేయడంలో కవిత దిట్ట.. ఆరోపణలు నిజమైతే ఆమె రాజీనామా చేయాలి: మధు యాష్కీ
- ఢిల్లీ లిక్కర్ కేసులో కవితపై ఆరోపణలు
- కవితపై తక్షణమే విచారణ జరిపించాలన్న మధు యాష్కీ
- 200 కోట్లతో భవంతి నిర్మించేంత ఆస్తులు కవితకు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్న
ఢిల్లీ లిక్కర్ కేసులో టీఆర్ఎస్ ఎంపీ కవితపై వెంటనే విచారణను ప్రారంభించాలని కాంగ్రెస్ నేత మధు యాష్కీ డిమాండ్ చేశారు. లేకపోతే ఆధారాలు తారుమారు అవుతాయని... ఆధారాలను తారుమారు చేయడంలో కవిత దిట్ట అని అన్నారు. 2014కు ముందు కేసీఆర్, కవితల ఆస్తులు ఎంత? ఇప్పుడున్న ఆస్తులు ఎంత? అని ప్రశ్నించారు.
మూడు బెడ్రూమ్ ల ఇంటి నుంచి రూ. 200 కోట్లతో భవంతి నిర్మించేంత ఆస్తులు కవితకు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. నిజమాబాద్ లో కోట్లాది రూపాయల ఆస్తులు, ఫామ్ హౌస్ లు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగారు. కవితపై ఆరోపణలు నిజమైతే ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రంపై కేసీఆర్ పోరాటం చేస్తున్నందు వల్లే బీజేపీ తనపై ఆరోపణలు చేస్తోందని కవిత అనడం హాస్యాస్పదమని మధు యాష్కీ అన్నారు. కవితపై బీజేపీ కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితం కాకుండా... ఆమెపై తక్షణమే విచారణ జరిపించాలని కోరారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం భారీ అవినీతికి పాల్పడిందని మండిపడ్డారు.