Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కొన్నింటిని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
- సుదీర్ఘకాలంగా నిర్మాణంలో ఉన్న వెలిగొండ ప్రాజెక్టు
- 60-సి కింద డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ పనుల తొలగింపు
- రూ.84 కోట్ల విలువైన పనులకు అనుమతులు
- ఉత్తర్వులు జారీ చేసిన జలవనరుల శాఖ
ఏపీలో వెలిగొండ ప్రాజెక్టు సుదీర్ఘకాలంగా నిర్మాణంలో ఉంది. తాజాగా, వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కొన్నింటిని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తీగలేరు బ్రాంచ్ కెనాల్లో కొన్ని పనులను తొలగిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. 60-సి కింద డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ పనులను తొలగిస్తున్నట్టు వివరించింది.
అలాగే తీగలేరు సప్లయి చానల్ కు సంబంధించి మిగతా రూ.84 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. ఈ పనులకు కొత్తగా టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
తీగలేరు సప్లయి చానల్ ద్వారా 11,500 ఎకరాలకు నీరందించే వెసులుబాటు ఉంది. వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా తీగలేరు పనులు కూడా జరుగుతున్నాయి.