Joe Biden: భారతీయ అమెరికన్లకు ఇచ్చిన ఎన్నికల హామీ నెరవేర్చిన బైడెన్

Biden implements his election assurance to Indian Americans

  • అమెరికా ప్రభుత్వంలో భారత సంతతి వ్యక్తులు
  • కీలక పదవులు చేపడుతున్న వైనం
  • రొనాల్డ్ రీగన్ హయాం నుంచి మొదలు
  • ట్రంప్ ప్రభుత్వంలో 80 మంది భారతీయ అమెరికన్లు
  • బైడెన్ సర్కారులో 130 మందికి చోటు

మునుపటితో పోల్చితే ఇప్పుడు అమెరికా ప్రభుత్వంలో కీలక పదవులు చేపట్టిన  భారత సంతతి వ్యక్తుల సంఖ్య మరింత పెరిగింది. రొనాల్డ్ రీగన్ తొలిసారిగా భారత సంతతి వ్యక్తులను ప్రభుత్వంలోకి తీసుకున్నారు. ఒబామా హయాం నాటికి ప్రభుత్వంలో కీలక పదవుల్లో కొలువైన భారతీయ అమెరికన్ల సంఖ్య 60కి చేరింది. డొనాల్డ్ ట్రంప్ హయాంలో 80 మంది భారతీయ అమెరికన్లు అధ్యక్ష కార్యవర్గంలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఇప్పుడు బైడెన్ కార్యవర్గంలో పనిచేస్తున్న ఇండో-అమెరికన్ల సంఖ్య 130కి పెరిగింది. 

ఎన్నికల వేళ బైడెన్.... ట్రంప్ కార్యవర్గంలో కంటే తాను అత్యధిక సంఖ్యలో భారతీయ అమెరికన్లకు పట్టం కడతానని మాటిచ్చారు. దశల వారీగా ఆ హామీని ఆయన నిలబెట్టుకున్నారు. బైడెన్ కార్యవర్గంలోని భారతీయ అమెరికన్లందరూ గతవారం భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత రాయబారి తరణ్ జీత్ సింగ్ సంధు నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. అమెరికా జనాభాలో భారతీయ అమెరికన్లు ఒక శాతం ఉన్నారు.

  • Loading...

More Telugu News