Rahul Gandhi: పెగాసస్ పై సుప్రీం కమిటీకి కేంద్రం సహకరించకపోవడం చూస్తుంటే ఏదో దాస్తున్నారనిపిస్తోంది: రాహుల్ గాంధీ

Rahul Gandhi responds on SC hearing on Pegasus row

  • దేశంలో సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం
  • ప్రముఖులపై నిఘా కోసం ఇజ్రాయెల్ సాఫ్ట్ వేర్
  • ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం
  • తమకు కేంద్రం సహకరించలేదన్న కమిటీ 

దేశంలోని ప్రముఖులపై నిఘా వేసేందుకు కేంద్రం పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగిస్తోందన్న కేసులో సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టడం తెలిసిందే. అంతకుముందు, ఈ స్కాంపై నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించగా, పెగాసస్ అంశంలో కేంద్రం తమకు సహకరించలేదని ఆ కమిటీ నేటి విచారణలో సుప్రీంకోర్టుకు నివేదించింది. 

దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన కమిటీకి కేంద్రం సహకరించకపోవడం చూస్తుంటే పెగాసస్ వ్యవహారంలో ఏదో దాస్తున్నారన్న విషయం స్పష్టమవుతోందని పేర్కొన్నారు. సుప్రీం కమిటీకి సహాయ నిరాకరణ చేయడం ద్వారా ఈ విషయంలో వాస్తవాలను దాచి, తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాలరాసేందుకు ప్రయత్నించినట్టు ప్రధాని మోదీ, కేంద్రం అంగీకరించినట్టయిందని రాహుల్ గాంధీ విమర్శించారు.

  • Loading...

More Telugu News