Gandhi Hospital: సినిమా చూడమని ట్యాబ్ చేతికిచ్చి మెదడుకి ఆపరేషన్.. ‘గాంధీ’ వైద్యుల ఘనత

Secunderabad Gandhi Hospital Doctors perform surgery with out giving anesthesia

  • 50 ఏళ్ల మహిళ మెదడులోని కణతిని తొలగించిన వైద్యులు
  • రెండు గంటలపాటు సినిమాలో లీనమైపోయిన మహిళ
  • ఆమెతో మాట్లాడుతూనే ఆపరేషన్ పూర్తిచేసిన వైద్యులు

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వైద్యులు ఓ ఘనత సాధించారు. అదేమిటంటే, రోగి స్పృహలో ఉండగానే ఆమె క్లిష్టమైన సర్జరీని నిర్వహించారు. ఓ మహిళ మెదడులోని కణతిని ఆమెకు సినిమా చూపిస్తూ, ఆమెతో మాట్లాడుతూ చాలా ఈజీగా తీసేశారు.

హైదరాబాద్‌కు చెందిన మహిళ (50) అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరగా, వైద్యులు ఆమె మెదడులో కణతిని గుర్తించారు. నిన్న ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేసిన వైద్యులు ఆమెను స్పృహలోనే ఉంచి ఆపరేషన్ మొదలుపెట్టారు. ట్యాబ్ లో ఆమెకు సినిమా చూపించి ఆపరేషన్ ప్రారంభించారు. 

మధ్యమధ్యలో ఆమెతో మాట్లాడుతూ.. అభిమాన నటీనటుల గురించి తెలుసుకుంటూ ఆపరేషన్ కానిచ్చేశారు. ఆపరేషన్ జరుగుతుందన్న ఊహే ఆమెకు రానీయకుండా చేసి మెదడులోని కణతిని విజయవంతంగా తొలగించినట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ఇలా స్పృహలో ఉండగానే రోగి మెదడుకు సర్జరీ చేసే పద్ధతిని 'అవేక్ క్రేనియాటోమీ' అంటారని ఆయన తెలియజేశారు.


  • Loading...

More Telugu News