TDP: ఆగిన హంద్రీ-నీవా ప‌నుల‌ను ప‌రిశీలించిన చంద్ర‌బాబు.. మ‌రో రూ.50 కోట్లు పెట్టి ఉంటే కుప్పంకు నీళ్లొచ్చేవ‌ని వ్యాఖ్య

chandrababu visits handri neeva works in kuppam

  • 3 రోజులుగా కుప్పంలో ప‌ర్య‌టిస్తున్న చంద్ర‌బాబు
  • స‌లార్ల‌ప‌ల్లి వ‌ద్ద నిలిచిన హంద్రీ-నీవా ప‌నుల‌ను ప‌రిశీలించిన వైనం
  • మూడేళ్లుగా ఈ ప‌నులు నిలిచిపోయాయ‌ని ఆగ్ర‌హం

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో గ‌డ‌చిన 3 రోజులుగా ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తొలి రోజు రామ‌కుప్పం మండ‌లంలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు... 2, 3 రోజుల్లో కుప్పం మండ‌లంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో నిలిచిన హంద్రీ-నీవా సుజ‌ల స్ర‌వంతి ప‌నుల‌ను ఆయ‌న శుక్ర‌వారం ప‌రిశీలించారు.

కుప్పం మండ‌లం స‌లార్ల ప‌ల్లి వ‌ద్ద హంద్రీ- నీవా ప‌నుల‌ను పరిశీలించిన చంద్ర‌బాబు... ఈ పనులు పూర్తి కాక‌పోవ‌డంతోనే కుప్పంకు హంద్రీ-నీవా నీళ్లు రాలేద‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. ఈ ప‌నుల్లో భాగంగా మ‌రో రూ.50 కోట్లు ఖ‌ర్చు పెట్టి ఉంటే కుప్పంకు కూడా హంద్రీ- నీవా నీళ్లు అందేవ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. తాను అధికారం దిగిపోయిన త‌ర్వాత మూడేళ్లుగా ఈ ప‌నుల‌ను వైసీపీ ప్ర‌భుత్వం ఉద్దేశ‌పూర్వ‌కంగానే నిలిపివేసింద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

  • Loading...

More Telugu News