Rajasthan: ఓటు వేస్తానంటేనే కాళ్లు వదులుతా.. విద్యార్థి సంఘాల ఎన్నికల్లో సరికొత్త ప్రచారం!

Rajasthan student leaders touch girls feet to get votes ahead of union elections Watch video

  • రాజస్థాన్ లోని బరాన్ లో చోటు చేసుకున్న దృశ్యాలు
  • పాదాలు పట్టుకుని మరీ ఓట్ల కోసం వేడుకోలు
  • మోకాళ్లపై నించుని, శిరసు వంచి ప్రచారం

అవేమీ పంచాయతీ ఎన్నికలు కావు. కార్పొరేషన్ ఎన్నికలు కావు, విధానసభ ఎన్నికలు అంతే కంటే కావు. వారంతా బుద్ధిగా చదువుకోవాల్సిన విద్యార్థులు. అయితేనేమీ, విద్యార్థి సంఘాల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సరికొత్త ప్రచారానికి పూనుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రం బరాన్ లో శుక్రవారం విద్యార్థి సంఘాల ఎన్నికలు జరిగాయి. 

ఈ ఎన్నికలకు ముందు ప్రచారాన్ని విద్యార్థులు కొత్త పుంతలు తొక్కించారు. విద్యార్థులు, విద్యార్థినుల కాళ్లపై పడి వేడుకున్నారు. దయచేసి విలువైన ఓటు తమకు వేసి గెలిపించాలంటూ ప్రాధేయపడ్డారు. వీలైతే నేలపై పడుకుని కాళ్లను పట్టుకుని వేడుకున్నారు. కాళ్లు దొరక్కపోతే నేలపై పడుకుని దండం పెట్టి ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. మోకాళ్లపై నించుని అడిగారు. అదీ కుదరకపోతే రెండు చేతులు జోడించి శిరసు వంచి నమస్కరించి తమను గెలిపించాలని కోరారు.

అబ్బాయిలనే కాదు, విద్యార్థినులు సైతం ఇవే చర్యలకు దిగారు. వీరి చర్యలతో కొందరు విద్యార్థినులు అసౌకర్యానికి గురి కాగా, కొందరు నవ్వు ఆపుకోలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఒక విద్యార్థి సామాజిక మాధ్యమ వేదికలపైకి తీసుకురావడంతో ఇది వైరల్ గా మారింది. 

  • Loading...

More Telugu News