Asia Cup 2022: కోహ్లీ ఖాతాలో ఇప్పటి వరకు ఎవరూ సాధించలేని రికార్డు!
- ఆసియాకప్ తొలి మ్యాచ్ కోహ్లీకి నూరో టీ20 మ్యాచ్
- ప్రతి ఫార్మాట్ లోనూ 100 మ్యాచ్ లు ఆడిన తొలి భారత ఆటగాడిగా రికార్డు
- కోహ్లీ బ్యాట్ తో మెరుస్తాడేమో చూడాల్సిందే..
చాలా విరామం తర్వాత భారత్-పాకిస్థాన్ జట్లు ఆదివారం తలపడనున్నాయి. ఆసియాకప్ 2022 ఇందుకు వేదిక కానుంది. ఈ మ్యాచ్ తో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరబోతోంది. టీ20ల్లో కోహ్లీకి ఇది నూరో మ్యాచ్ కానుంది. ఈ మ్యాచ్ ముగిస్తే.. ప్రతి ఫార్మాట్ లోనూ అంతర్జాతీయంగా 100 మ్యాచ్ లు, అంతకంటే ఎక్కువ ఆడిన మొదటి భారత క్రికెటర్ గా అతడు రికార్డు సృష్టించబోతున్నాడు.
ఇప్పటి వరకు 99 టీ20 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ 3,308 పరుగులు చేసి 50.12 స్ట్రయిక్ రేటుతో ఉన్నాడు. 30 అర్ధ సెంచరీలు ఇందులో ఉన్నాయి. కోహ్లీకి ఆసియా కప్ కీలకం కానుంది. అతడి నుంచి మంచి ప్రదర్శనను అభిమానులు ఎదురు చూస్తున్నారు. చివరిగా భారత్-పాక్ జట్లు గతేడాది టీ20 ప్రపంచకప్ సందర్భంగా తలపడ్డాయి. నాడు కోహ్లీ కెప్టెన్సీలో భారత్ దారుణ ఓటమి చూసింది. అదే మ్యాచ్ లో కోహ్లీ 49 బంతుల్లో 57 పరుగులు చేసినా ఉపయోగం లేకపోయింది.