Manish Tiwari: అప్పుడు ఏకాభిప్రాయం వచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు: కాంగ్రెస్ నేత మనీశ్ తివారి
- రెండేళ్ల క్రితమే సోనియాకు 23 మంది లేఖ రాశామన్న మనీశ్
- భారత్ కు, కాంగ్రెస్ మధ్య దూరం పెరిగినట్టు కనిపిస్తోందని వ్యాఖ్య
- పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని లేఖలో పేర్కొన్నామని వెల్లడి
- ఆ లేఖ తర్వాత అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని వివరణ
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ బీటలు వారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒక్కో ఎన్నికకు ఆ పార్టీ బలహీనపడుతూ వస్తోంది. తాజాగా గులాంనబీ ఆజాద్ ఆ పార్టీకి రాజీనామా చేయడం కలకలం రేపింది. తాజాగా మరో సీనియన్ నేత మనీశ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ కు, కాంగ్రెస్ మధ్య దూరం పెరిగినట్టు కనిపిస్తోందని ఆయన అన్నారు.
రేండేళ్ల క్రితమే 23 మంది సీనియర్ నేతలం కలిసి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశామని... పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని, తక్షణమే అన్ని చర్యలు తీసుకుని పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో పేర్కొన్నామని ఆయన అన్నారు. ఆ లేఖ తర్వాత అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతూనే వచ్చిందని చెప్పారు. 2020లో సోనియా నివాసంలో జరిగిన సమావేశంలో నేతల మధ్య ఏకాభిప్రాయం వచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు.