Telangana: తెలంగాణ ఐసెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులే టాపర్లు
- ఫలితాలను విడుదల చేసిన కేయూ వీసీ రమేశ్
- అర్హత సాధించిన 61,613 మంది విద్యార్థులు
- టాప్ 3 ర్యాంకులను కైవసం చేసుకున్న ఏపీ విద్యార్థులు
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ సర్కారు నిర్వహించిన టీఎస్ ఐసెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి రమేశ్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మొత్తంగా 61,613 మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్రంలోని 272 కళాశాలల్లో అందుబాటులో ఉన్న 27,017 సీట్ల భర్తీ కోసం ఈ పరీక్షను నిర్వహించారు.
ఇటీవలి కాలంలో తెలంగాణలో నిర్వహిస్తున్న పలు పోటీ పరీక్షల్లో ఏపీ విద్యార్థులు టాపర్లుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అదే తరహాలో టీఎస్ ఐసెట్ ఫలితాల్లోనూ టాప్ 3 ర్యాంకులను ఏపీ విద్యార్థులే చేజిక్కించుకున్నారు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన దంతాల పూజిత్ వర్థన్ తొలి ర్యాంకును దక్కించుకున్నాడు. కడప జిల్లా అంబవరం ఉమేశ్ చంద్రారెడ్డి రెండో ర్యాంకు సాధించాడు.