Prakash Raj: బిల్కిస్ బానో దోషుల విడుదలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న ప్రకాశ్ రాజ్... ఫొటోలు ఇవిగో!

Prakash Raj takes part in protests demanding justice for Bilkis Bano
  • 2002లో గుజరాత్ అల్లర్లు
  • ముస్లిం మహిళ బిల్కిస్ బానోపై అత్యాచారం
  • 11 మందికి జీవితఖైదు
  • ఇటీవల క్షమాభిక్ష కింద విడుదల
గుజరాత్ అల్లర్ల సందర్భంగా ముస్లిం మహిళ బిల్కిస్ బానోపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను ఇటీవల గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష కింద విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని మైసూరు నగరంలోనూ ప్రజాగ్రహం పెల్లుబికింది. 

ఈ నిరసన ప్రదర్శనల్లో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా పాల్గొన్నారు. బిల్కిస్ బానోకు న్యాయం జరిగితే అందరికీ న్యాయం జరిగినట్టేనని నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. నిరసన ప్రదర్శనల్లో తాను పాల్గొన్నప్పటి ఫొటోలను కూడా పంచుకున్నారు.
Prakash Raj
Bilkis Bano
Protests
Mysore
Karnataka

More Telugu News