Somu Veerraju: వినాయక చవితి ఉత్సవాలకు ప్రభుత్వం నిబంధనల పేరుతో అడ్డంకులు సృష్టించడం సరికాదు: సోము వీర్రాజు
- ఈ నెల 31న వినాయకచవితి
- రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ మండపాల ఏర్పాటు
- ప్రభుత్వం ఉత్సవ కమిటీలను బెదిరిస్తోందన్న సోము వీర్రాజు
- ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరిక
- సీఎం జగన్ కు లేఖ
ఏపీలో వినాయక చవితి ఉత్సవాలకు ప్రభుత్వం నిబంధనల పేరిట అడ్డంకులు సృష్టించడం సరికాదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల పేరుతో ఉత్సవ కమిటీలను భయపెడుతోందని, కమిటీల పట్ల బెదిరింపు ధోరణులు మానుకోవాలని అన్నారు.
వినాయక మండపాల ఏర్పాటుకు ముందస్తు హామీ పత్రం తప్పనిసరి చేయడాన్ని ఖండిస్తున్నట్టు సోము వీర్రాజు తెలిపారు. గణేశ్ మండపాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే తాము ప్రజా ఉద్యమం చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు సోము వీర్రాజు సీఎం జగన్ కు లేఖ రాశారు.