Constable Posts: తెలంగాణ పోలీస్ నియామక ప్రిలిమ్స్ పరీక్షలో తప్పులు ఉన్నాయంటూ ప్రచారం... స్పందించిన పోలీస్ శాఖ
- ఇటీవల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్
- నిన్న ప్రిలిమ్స్ పరీక్ష
- 13 ప్రశ్నల్లో తప్పులు వచ్చాయంటూ ప్రచారం
- వదంతులు నమ్మవద్దన్న పోలీస్ శాఖ
- నిపుణుల కమిటీ క్లారిటీ ఇస్తుందని వెల్లడి
తెలంగాణ పోలీస్ విభాగంలో 15,644 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా, నిన్న (ఆగస్టు 28) ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ఈ కానిస్టేబుల్ పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. 91.34 శాతం హాజరు నమోదైంది. అయితే, ఈ ప్రిలిమ్స్ లో 13 ప్రశ్నలు తప్పుగా వచ్చాయంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ స్పందించింది.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దంటూ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. సెట్ 'డి'లో కొన్ని ప్రశ్నలకు సంబంధించి గందరగోళం ఏర్పడినట్టు తమకు ఫిర్యాదులు వచ్చాయని, ఆ ఫిర్యాదులను నిపుణుల కమిటీ పరిశీలించి రెండు రోజుల్లో స్పష్టత ఇస్తుందని తెలిపారు. అప్పటివరకు పుకార్లను నమ్మవద్దంటూ సూచించారు.