YSR Statue: నరసరావుపేటలో వైఎస్ విగ్రహ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ
- నరసరావుపేటలో వైఎస్ విగ్రహ ప్రతిష్టాపన
- ఇది అనధికారికమంటూ హైకోర్టులో పిటిషన్
- జీవో-18కి విరుద్ధమన్న హైకోర్టు
- చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు
నరసరావుపేటలో వైఎస్సార్ విగ్రహ ప్రతిష్టాపనపై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. నరసరావుపేటలో అనధికారికంగా వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేశారని శేఖర్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ, అనధికారికంగా విగ్రహాల ఏర్పాటు సుప్రీం కోర్టు తీర్పు, జీవో-18కి విరుద్ధమని పేర్కొంది. విగ్రహ ఏర్పాటుపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.
కాగా, ఈ విగ్రహ ఏర్పాటును గతంలో టీడీపీ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. నరసరావుపేటలో వైఎస్ విగ్రహ ఏర్పాటుకు అధికారులు ఎలా అనుమతి ఇచ్చారని టీడీపీ నేత చదలవాడ అరవింద్ బాబు ప్రశ్నించారు. కోడెల విగ్రహ ఏర్పాటుకు కూడా అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.