Tamilisai Soundararajan: ఖైరతాబాద్ మహాగణపతికి తొలిపూజ చేసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

Telangana Governor Tamilisai offers first prayer to Khairatabad Maha Ganapati
  • నేడు వినాయకచవితి
  • ఖైరతాబాద్ లో కొలువైన మహాగణపతి
  • స్వామివారిని దర్శించుకున్న గవర్నర్
  • తొలిసారిగా ఖైరతాబాద్ లో మట్టి విగ్రహం
  • విగ్రహం కోసం రూ.1.50 కోట్లు ఖర్చుచేసిన నిర్వాహకులు
వినాయక చతుర్థి సందర్భంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు కొలువుదీరాడు. ఈ ఉదయం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఖైరతాబాద్ వినాయకుడికి తొలిపూజ నిర్వహించి తరించారు. ప్రజాసంక్షేమాన్ని కోరుకుంటూ ప్రార్థించారు. గవర్నర్ కు పురోహితులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

కాగా, ఖైరతాబాద్ లో తొలిసారిగా మట్టితో చేసిన బొజ్జ గణపయ్య విగ్రహం ఏర్పాటు చేశారు. పంచముఖ మహాలక్ష్మి రూపంలో ఉన్న ఈ ఖైరతాబాద్ గణేశ విగ్రహం ఎత్తు 50 అడుగులు. లంబోదరుడికి కుడివైపున శ్రీ షణ్ముక సుబ్రహ్మణ్యస్వామి, ఎడమవైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రీ దేవి కొలువుదీరారు. ఈ భారీ విగ్రహం తయారీకి రూ.1.50 కోట్లు ఖర్చయినట్టు నిర్వాహకులు తెలిపారు.
Tamilisai Soundararajan
Governor
Khairatabad
Maha Ganapati
Hyderabad
Telangana

More Telugu News