Andhra Pradesh: ఏపీ ఎస్ఎల్‌బీసీ చైర్మన్‌గా నవనీత్ కుమార్... జగన్‌తో భేటీ అయిన యూబీఐ జీఎం
- యూబీఐలో జనరల్ మేనేజర్‌గా కొనసాగుతున్న నవనీత్ కుమార్
- ఏపీ ఎస్ఎల్‌బీసీ చైర్మన్‌గా ఇటీవలే నియామకం
- సీఎం జగన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన వైనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్‌బీసీ)కి నూతన చైర్మన్‌గా నవనీత్ కుమార్ ఇటీవలే నియమితులయ్యారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లో జనరల్ మేనేజర్‌గా కొనసాగుతున్న ఆయన ఏపీ ఎస్ఎల్‌బీసీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు కూడా చేపట్టారు. ఈ క్రమంలో గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన నవనీత్ కుమార్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళిక తయారీ, వ్యవసాయం సహా ఇతర రంగాలకు రుణాల విడుదలకు సంబంధించి ఎస్ఎల్‌బీసీ కీలక భూమిక పోషిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తంగా రాష్ట్రాభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎస్ఎల్‌బీసీకి నూతన చైర్మన్‌గా నియమితులైన నవనీత్ కుమార్ సీఎం జగన్‌తో నేడు భేటీ అయ్యారు.