nasa: ఈ రాత్రికే నాసా అత్యంత శక్తిమంతమైన ‘ఆర్టెమిస్1’ రాకెట్ ప్రయోగం

Nasa to re attempt launching worlds most powerful rocket to Moon tonight

  • భవిష్యత్తులో చంద్రుని ఉపరితలంలోకి మనుషులను పంపడమే లక్ష్యం
  • రాత్రి 11.45 కి నింగిలోకి దూసుకెళ్లనున్న రాకెట్
  • ఇంధన లీకేజీ కారణంగా గత నెల 29న జరగాల్సిన ప్రయోగం నేటికి వాయిదా  

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రాకెట్ ను నాసా ఈ రోజు రాత్రి ప్రయోగించనుంది. భవిష్యత్తులో మానవులు చంద్రుని ఉపరితలంపైకి చేరుకోవడానికి వేదికను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ‘ఆర్టెమిస్1’ అనే వ్యోమ నౌకను నాసా చంద్రునిపైకి పంపనుంది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్‌ప్యాడ్ 39బి నుంచి ఈ వ్యోమనౌక బయలుదేరుతుంది. 

దీనిని భారత కాలమానం ప్రకారం చెప్పాలంటే..  ఈ రాత్రి 11:45 గంటలకు షెడ్యూల్ చేశారు. వాస్తవానికి ఈ ప్రయోగం ఆగస్టు 29వ తేదీనే జరగాల్సింది. కానీ, ఇంధన లీకేజీ కారణంగా చివరి నిమిషంలో రద్దు చేశారు. ఈ సమస్యను సరిదిద్దిన శాస్త్రవేత్తలు ప్రయోగానికి అంతా సిద్ధం చేశారు. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ కూడా ప్రయోగానికి అనుమతి నిచ్చింది. వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండటంతో ఈ రాత్రికే ప్రయోగం చేపట్టనున్నారు. 

322 అడుగుల (98 మీటర్లు) ఎత్తు ఉన్న రాకెట్ నాసా ఇప్పటివరకు నిర్మించిన అత్యంత శక్తిమంతమైనది కావడం విశేషం. త‌మ చ‌రిత్రలోనే అత్యంత శ‌క్తిమంత‌మైన రాకెట్‌గా ఆర్టెమిస్‌-1ను తీర్చిదిద్దింది. కానీ, ఇంజన్లో సమస్యల కారణంగా గత సోమవారం కౌంట్ డౌన్ ను నిలిపి వేసింది. సాంకేతిక సమస్యలను సరిదిద్ది రెండో ప్రయోగానికి రెడీ అయింది. దీని తర్వాత 2024లో చంద్రుని చుట్టూ వ్యోమగాములను పంపి, 2025లో వారిని ఉపరితలంపై దింపేందుకు నాసా ఈ ప్రయోగంతో మొదటి అడుగు వేయాలని చూస్తోంది. ఈ మిషన్ కోసం నాసా ఏకంగా 4.1 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.

  • Loading...

More Telugu News