supplements: గుండె ఆరోగ్యం కోసం మూడు సప్లిమెంట్లు

3 supplements you must take to boost heart health

  • ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ తో ఎంతో మేలు
  • చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్స్ ను తగ్గించే శక్తి
  • కోఎంజైమ్ క్యూ10, మెగ్నీషియంతోనూ గుండెకు మంచి

మారిన అలవాట్లతో ఆరోగ్యం చిన్నబోతోంది. ముఖ్యంగా ఎక్కువ మందికి గుండె సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే మార్గాలు చాలానే ఉన్నాయి. అందుకని సమస్య రాక ముందే, లేదంటే సమస్య కనిపించిన ఆరంభంలోనే జాగ్రత్తపడి, దిద్దుబాటు చర్యలు తీసుకోవడం మంచిది. 

ఇందుకోసం శారీరక వ్యాయామాలు ఒక చక్కని మార్గం. ప్రతి ఒక్కరూ రోజులో కనీసం 30-40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఆహారంలోనూ మార్పులు చేసుకోవాలి. ఫ్యాటీ, ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలను దాదాపు తగ్గించేయాలి. దీనికితోడు గుండె ఆరోగ్యం కోసం తీసుకోదగిన మూడు రకాల సప్లిమెంట్లు ఉన్నాయి. వీటిని వైద్యుల సూచన మేరకు తీసుకోవచ్చు.

ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఇన్ ఫ్లమేషన్ తగ్గుతుంది. ట్రై గ్లిజరైడ్స్ కూడా తగ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ధమనుల గోడ బలపడుతుంది. రక్తపోటు తగ్గుతుంది. రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. అసహజ హృదయ స్పందనలను నిరోధిస్తుంది. ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ చేపలలో సమృద్ధిగా లభిస్తాయి. అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్), వాల్ నట్స్ లోనూ ఉంటాయి. విడిగా కాడ్ లివర్ ఆయిల్ క్యాప్సూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 

కోఎంజైమ్ క్యూ10
ఇది కణాల్లో శక్తి తయారీకి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్. శరీరంలోని హానికారకాలను బయటకు పంపుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. చేపలు, మీట్, నట్స్ రూపంలో ఇది లభిస్తుంది. విడిగా సప్లిమెంట్లు కూడా లభిస్తాయి.

మెగ్నీషియం
గుండె కణజాలంలో బయో కెమికల్ రియాక్షన్స్ కు మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. రక్తపోటును అదుపు చేస్తుంది. ఒత్తిడి కారణంగా గుండెపై ప్రభావం పడకుండా కాపాడుతుంది. నట్స్, డార్క్ చాక్లెట్, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, అరటి పండ్లు, ముడి ధాన్యాల్లో, ఆకుపచ్చని కూరల్లో మెగ్నీషియం తగినంత ఉంటుంది.

  • Loading...

More Telugu News