Sharwanand: ఆరేళ్ల పాటు ఒక్క షర్టు కూడా కొనుక్కోకుండా అప్పులు తీర్చాను: శర్వానంద్

Sharwanand Interview

  • ఈ నెల 9న విడుదల కానున్న 'ఒకే ఒక జీవితం'
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న శర్వానంద్ 
  • గతంలో చేసిన 'కో అంటే కోటి' సినిమా ప్రస్తావన
  • ఆ సినిమా అప్పులపాలు చేసిందంటూ వ్యాఖ్య

శర్వానంద్ తాజా చిత్రంగా రూపొందిన 'ఒకే ఒక జీవితం' .. ఈ నెల 9వ తేదీన విడుదల కానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజాగా శర్వానంద్ ను తరుణ్ భాస్కర్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంలో శర్వానంద్ తన కెరియర్లో తనకి ఎదురైన ఒక సంఘటనను గురించి ప్రస్తావించాడు.

"చాలా కాలం క్రితం హీరోగా నేను 'కో అంటే కోటి' సినిమాను చేశాను. ఆ సినిమాను నేనే  ప్రొడ్యూస్ చేశాను. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయింది .. ఆర్ధికంగా నాకు నష్టాలు తెచ్చిపెట్టింది. ఆ సమయంలో నా ఫ్రెండ్స్ లో కొందరితో పాటు చాలా దగ్గరవారు కూడా దూరమయ్యారు. డబ్బుకు అంత ఇంపార్టెన్స్ ఉంటుందని అప్పటివరకూ నాకు తెలియదు.

నష్టం .. కష్టం ఎదురైతే ఇంతమంది ఇలా దూరమవుతారా? అనే విషయం నాకు అప్పుడే అర్థమైంది. ఆ సినిమా కోసం చేసిన అప్పులు తీర్చడానికి నాకు ఆరేళ్లు పట్టింది. ఈ ఆరేళ్లలో నేను ఒక్క షర్టు కూడా కొనుక్కోలేదు. వచ్చిన ప్రతి పైసాను ఇవ్వవలసిన వాళ్లకి ఇస్తూ వెళ్లాను. ఫ్లాప్స్ వలన కూడా కొన్ని పాఠాలు నేర్చుకున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News