Nitish Kumar: ప్రశాంత్ కిశోర్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన నితీశ్ కుమార్

Prashant Kishor secretly working for BJP says Nitish Kumar
  • పబ్లిసిటీ కోసం ప్రశాంత్ కిశోర్ ఏమైనా చేస్తాడన్న నితీశ్ 
  • బీహార్ లో ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో చేయనివ్వండని వ్యాఖ్య 
  • బీజేపీ కోసం ఆయన రహస్యంగా పని చేస్తున్నాడని ఆరోపణ 
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రశాంత్ కిశోర్ కు పబ్లిసిటీ ఎలా పొందాలో తెలుసని... పబ్లిసిటీ కోసం ఆయన ఏమైనా చేస్తారని విమర్శించారు. ప్రశాంత్ కిశోర్ చేసే ప్రకటనలకు అర్థం లేదని అన్నారు. 

బీహార్ లో ఆయన చేయాలనుకున్నది చేయనివ్వండని అన్నారు. 2005 నుంచి బీహార్ లో ఏం జరిగిందో ఆయనకు ఏం తెలుసని ప్రశ్నించిన నితీశ్ కుమార్... ఆయనకు కేవలం పబ్లిసిటీ ఎలా పొందాలి? స్టేట్ మెంట్లు ఎలా ఇవ్వాలి? అనేది మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. 

బీజేపీ కోసం ప్రశాంత్ కిశోర్ రహస్యంగా పని చేస్తున్నారని అన్నారు. బీజేపీతో ఉండాలని ఆయన మనసులో ఉన్నట్టుందని చెప్పారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నితీశ్ కుమార్ పైవ్యాఖ్యలు చేశారు.
Nitish Kumar
JDU
Prashant Kishor
Bihar
BJP

More Telugu News