India: ఐరాస మానవాభివృద్ధి సూచీలో 132వ స్థానంలో భారత్
- 2021-22 మానవాభివృద్ధి సూచీ విడుదల
- 2020లో భారత్ కు 130వ స్థానం
- రెండు స్థానాలు పతనమైన భారత్
- ర్యాంకింగ్స్ పై పలు అంశాల ప్రభావం
కరోనా సంక్షోభం అనేక దేశాల స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో యూఎన్ డీపీ తాజాగా 2021-22 మానవాభివృద్ధి సూచీని విడుదల చేసింది. మొత్తం 191 దేశాలు ఉన్న ఈ జాబితాలో భారత్ 132వ స్థానంలో నిలిచింది. 2020లో భారత్ ఈ సూచీలో 130వ స్థానంలో నిలవగా, ఇప్పుడు రెండు స్థానాలు పతనమైంది.
అయితే, ప్రస్తుత ర్యాంకులను, 2020 నాటి ర్యాంకులతో పోల్చలేమని యూన్ డీపీ పేర్కొంది. 2020లో 189 దేశాలతో మానవాభివృద్ధి రేటును గణించామని, ఈసారి 191 దేశాలను పరిగణనలోకి తీసుకున్నామని వివరించింది. కరోనా సంక్షోభం, ఉక్రెయిన్ లో యుద్ధ వాతావరణం, ప్రమాదకర పర్యావరణ మార్పులు ఆయా దేశాల ర్యాంకులను ప్రభావితం చేసినట్టు తెలిపింది.