KL Rahul: కోహ్లీ గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కేఎల్ రాహుల్ షాకింగ్ రిప్లయ్

KL Rahul irked by question on Virat Kohli

  • ఓపెనర్ గా కోహ్లీ రాణించాడన్న ఓ రిపోర్టర్
  • తదుపరి సిరీస్ లకూ ఓపెనర్ గా సూచిస్తారా? అంటూ ప్రశ్న
  • మీరే సూచించేటట్టు అయితే తాను బయట కూర్చుంటానన్న రాహుల్

ఆప్ఘనిస్థాన్ పై భారత్ గురువారం ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండడంతో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆ బాధ్యతల్లోకి వచ్చాడు. రాహుల్ కు జోడీగా విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభించి దంచి కొట్టాడు. అంతేకాదు, సుదీర్ఘకాలం తర్వాత విరాట్ కోహ్లీ శతకం చేయగలిగాడు. దీంతో మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో కేఎల్ రాహుల్ పలు ప్రశ్నలు ఎదుర్కొన్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ గురించి అడిగిన ఓ ప్రశ్నకు అతడిచ్చిన జవాబు రిపోర్టర్ ను తెల్లబోయేలా చేసింది.

‘‘కోహ్లీ ఓపెనర్ గా సెంచరీ సాధించాడు. కనుక రానున్న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ లకు, టీ20 ప్రపంచకప్ కు ఓపెనర్ గా కోహ్లీని ప్రయత్నించొచ్చంటూ టీమ్ మేనేజ్ మెంట్ కు వైస్ కెప్టెన్ గా సూచిస్తారా?’’ అని ఓ రిపోర్టర్ రాహుల్ ను ప్రశ్నించాడు. దీనికి రాహుల్.. ‘మీరే సూచించేటట్టు అయితే నేను బయట కూర్చుంటా’ అని బదులిచ్చాడు. మరొకరు సూచించేటట్టు అయితే తానున్నది ఎందుకు? అన్న అర్థం వచ్చేలా రాహుల్ జవాబు ఉండడం గమనార్హం. 

‘‘విరాట్ ఓపెనింగ్ లోనే శతకాలు చేస్తాడని అనుకోవద్దు. మూడో నంబర్ నుంచి ఏడో నంబర్ వరకు ఎక్కడైనా సెంచరీ చేయవచ్చు. జట్టులో భిన్న పాత్రలు పోషించే దానిపై ఆధారపడి ఉంటుంది. తదుపరి సిరీస్ లో అతడి (కోహ్లీ) పాత్ వేరేలా ఉండొచ్చు. అతడు అత్యుత్తమ ప్రదర్శనే చేస్తాడు. అందులో సందేహం లేదు’’ అని రాహుల్ తెలిపాడు. 

  • Loading...

More Telugu News