Supreme Court: టీడీపీ అధినేత చంద్రబాబు ఆస్తులపై లక్ష్మీపార్వతి పిటిషన్... కొట్టివేసిన సుప్రీంకోర్టు

Supreme Court dismisses Lakshmi Parvathi petition seeking probe on Chandrababu Naidu assets

  • అప్పట్లో లక్ష్మీపార్వతి పిటిషన్ హైకోర్టులో కొట్టివేత
  • సుప్రీంకోర్టుకు వెళ్లిన లక్ష్మీపార్వతి
  • చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలంటూ పిటిషన్
  • ఆస్తుల వివరాలు తెలుసుకోవడానికి మీరెవరన్న న్యాయస్థానం

టీడీపీ అధినేత చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లిన వైసీపీ నేత లక్ష్మీపార్వతికి ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు ఆస్తులకు సంబంధించి లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అప్పట్లో లక్ష్మీపార్వతి పిటిషన్ హైకోర్టులో తిరస్కరణకు గురికాగా, ఆమె అత్యున్నత న్యాయస్థానానికి వచ్చారు. 

ఈ నేపథ్యంలో, లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం బెంచ్ విచారణ చేపట్టింది. అప్పట్లో హైకోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే పిటిషన్ ను కొట్టివేసిందని, పిటిషన్ లో లక్ష్మీపార్వతి ప్రస్తావించిన అంశానికి విలువ లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. అసలు, ఒకరి ఆస్తుల గురించి తెలుసుకోవడానికి మీరెవరంటూ ప్రశ్నించింది. ఎవరి ఆస్తుల వివరాలు ఎవరికి తెలియాలి? అంటూ వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News