Drunk Driving: బాగా మందేసి.. బ్రీత్ అనలైజర్ టెస్టు నుంచి తప్పించుకునేందుకు డ్యాన్స్ చేసిన మహిళ.. వైరల్ వీడియో ఇదిగో
- అమెరికాలోని ఫ్లోరిడాలో పబ్ కు వెళ్లి మద్యం తాగిన మహిళ
- కారు నడుపుతూ పోలీసులకు చిక్కినా బ్రీత్ అనలైజర్ టెస్టుకు నిరాకరణ
- ప్రతిగా డ్యాన్స్ చేస్తూ తాను తాగలేదంటూ బుకాయింపు.. చివరికి అరెస్టు
ఓ 38 ఏళ్ల మహిళ.. పబ్ కు వెళ్లి బాగా మద్యం తాగింది.. బయటికి వచ్చి కారు డ్రైవ్ చేయడం మొదలుపెట్టింది. మధ్యలో పోలీసులు ఆమెను ఆపారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేయడం కోసం బ్రీత్ అనలైజర్ ను బయటికి తీశారు. దానిలోకి ఊదాలని ఆ యువతిని కోరారు. కానీ అందుకు ఆమె నిరాకరించింది.
ఇంతవరకు బాగానే ఉందిగానీ.. తాను తాగి లేనని, కావాలంటే చూడాలని పోలీసులకు చెబుతూ.. డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. కానీ కాసేపటికి అలసి ఆగిపోయింది. పోలీసులు ఎంతగా నచ్చజెప్పినా వినలేదు. అయినా డ్యాన్స్ చేస్తూ.. తనను వదిలేయాలని చెబుతూనే ఉంది. ఇలా కొన్ని నిమిషాలు జరిగాక.. ఆమె ఆగిపోయింది.
తర్వాత పోలీసులు ఆమెను ఒక వైట్ లైన్ పై తూలిపడకుండా నడవాలని సూచించారు. అలా నాలుగు అడుగులు వేసిన ఆమె.. ఆ తర్వాత నడవలేకపోయింది. అనంతరం పోలీసులతో వాదనకు దిగింది. దీనితో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. తాగి వాహనం నడుపుతోందని కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఈ ఘటనను పోలీసులు వీడియో తీశారు. దీనికి సంబంధించిన వీడియో ఇటీవల వైరల్ గా మారింది. లక్షన్నర మందికిపైగా దీనిని వీక్షించారు.